ఉపాధి హామీ నుంచి గాంధీ పేరును తొలగింపు అప్రజా స్వామీకం
లౌకిక దేశంలో మోడీ-అమిత్ షా పప్పులు ఉడుకవు..
రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బిజెపి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుంది.
పథకాల పేర్లు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వాల మీద భారాన్ని మోపే ప్రయత్నం చేస్తున్న బిజెపి ప్రభుత్వం..
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలొకి రావడం రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి ‘వికసిత్ భారత్ జి.రామ్.జి’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకు వస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు నేడు వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ జాతీయ రహదారి పై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బైఠాయించి మోడీ డౌన్ డౌన్ అంటూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ..బీజేపీ నేతలు అధికారం ఉంది కదా అని దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే నాగరాజు గారు విమర్శించారు. ప్రతి భారతీయుని గౌరవం దెబ్బ తీసేలా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అట్టడుగు పేద ప్రజలకు కరువు కాటకాల్లో ఉన్నపుడు కాంగ్రెస్ తీసుకున్న గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. సోనియా, రాహుల్ మీద కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆక్షేపించారు. పార్లమెంట్లో ఈ చట్టం వెనక్కి తీసుకొనేంత వరకూ పల్లెలు ఏకం కావాలని పిలుపునిచ్చారు…
గాంధీ కుటుంబం పేరు వింటేనే బిజెపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు గాడ్సేను పూజించేవారు కావడం వల్ల గాంధీ పేరుని తొలగించాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు అప్పటి ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ తో చర్చించి జాతీయ ఉపాధి పథకాన్ని తీసుకువచ్చిన సోనియా గాంధీ గారు. నేడు ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడం అప్రజా స్వామికమనీ స్పష్టం చేశారు మహాత్మా గాంధీ పేరు ప్రజల హృదయాల నుంచి ఎవరు చెప్పలేరన్నారు..రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బిజెపి తరలిపోయిందని మన మమస్మృతి అమలు చేయాలని పన్నాగం చేస్తుందని ఆరోపించారు గాంధీ నెహ్రూ వారి సత్యాన్ని మరిపించాలనే ప్రయత్నాలు ఫలించామన్నారు లౌకిక దేశంలో మోడీ అమిత్యాల పప్పులు స్పష్టం చేశారు కులం మతం పేరుతో రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలొకి రావడం ఖాయమని రాహుల్ గాంధీని ప్రధాని కావడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు…
మహాత్మా గాంధీ ఉపాధి కల్పన పేరును మారుస్తూ, ఖర్చుల భారం 60 శాతం కేంద్రం – 40 శాతం రాష్ట్ర ప్రభుత్వంపై మోపే విధంగా కొత్త కొత్త చట్టాలను తీసుకువస్తున్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అయూబ్ మాట్లాడుతూ…కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రతి భారతీయుణ్ణి గౌరవాన్ని దెబ్బతినేలా ఉందన్నారు కరువు కాటకాలు ఆర్థిక నష్టాలు సమయంలో అట్టడుగు పేదలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు కోట్లాది పేద కుటుంబాలకు ఉపాధి గౌరవాన్ని కల్పించిన ఈ గొప్ప పథకాన్ని నేడు బిజెపి ప్రభుత్వం నిర్వేర్యం చేస్తుందని విమర్శించారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ లపై ఉన్న కక్షతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకువస్తుందని ఆరోపించారు ఇది ప్రజాస్వామ్యానికి సామాజిక న్యాయానికి విరుద్ధమని స్పష్టం చేశారు పార్లమెంట్లో ఈ చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు గ్రామాలు ప్రజలు ఏకం కావాలని ఎమ్మెల్యే నాగరాజు పిలుపునిచ్చారు అందరూ ఒకదాటిపైకి వచ్చి ఈ అన్యాయ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు…మహాత్మా గాంధీ ఉపాధి కల్పన పేరును మారుస్తూ, ఖర్చుల భారం 60 శాతం కేంద్రం – 40 శాతం రాష్ట్ర ప్రభుత్వంపై మోపే విధంగా కొత్త కొత్త చట్టాలను తీసుకువస్తున్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.”
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు