కాంగ్రెస్ పార్టీలో చేరిన యువ సర్పంచ్
రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ బలోపేతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండలం కేంద్రంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఘన విజయం సాధించిన వారణాశి మౌనిక అజయ్ (అంజి) ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.సీనియర్ నాయకుల సమక్షంలో, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) క్యాంపు కార్యాలయంలో ఈ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సర్పంచ్ మౌనిక అజయ్‌తో పాటు గ్రామ వార్డు సభ్యులు మైస సురేందర్, తడక ప్రియాంక నరేష్, పల్లె కళ్యాణి అశోక్, బోగి లలిత సారయ్య, మేకల రాజు లకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. యువ నాయకులు,ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తోందని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సర్పంచ్ వారణాశి మౌనిక అజయ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, రైతు సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సర్పంచ్‌గా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య,ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయినేని సంపత్ రావు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య,గ్రామ కమిటీ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి,జిల్లా నాయకుడు గండి తిరుపతి గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు