జాగృతిలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
కరీంనగర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాగృతిలో చేరారు.కరీంనగర్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో,మండల ఇంచార్జ్ జంగ అపర్ణ సాగర్ ఆధ్వర్యంలో కమాగ్రి అంజనేయులు,దాసరి అంజలి,పుల్లురి శ్యామల,కారుపాకల శ్రీలత,బీస లక్ష్మీ జాగృతిలో చేరారు.ఈ సందర్భంగా జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ నూతనంగా చేరిన నాయకులకు జాగృతి కండువాలు కప్పి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,..జాగృతి అధినేత్రి కవిత నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా జాగృతి పనిచేస్తోందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని,ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కోల్పోయిన కారణంగానే నాయకులు జాగృతిలో చేరుతున్నారని హరిప్రసాద్ విమర్శించారు.2029లో తెలంగాణ రాష్ట్రానికి కవిత నాయకత్వం వహించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాగృతి ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి,జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్,చంటి శ్రీనివాస్,అధివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్,యువజన నాయకుడు హుస్నాబాద్ రాజ్‌కుమార్,జిల్లా నాయకుడు బసవేణి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.