ఇందిరా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం: వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చి పాపయ్య
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధి లో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో గురువారం కోదాడకు చెందిన ఎండి రహమతుల్లా ఎండి హపిజు న్నస బేగం ల వర్ధంతి సందర్భంగా కోదాడకు చెందిన వారి చిన్న కుమార్తె ఎస్కే జుబేదా ఆశ్రమంలో ఉన్న అనాధలకు మానసిక వికలాంగులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మునగాల వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చి పాపయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఇలాగే ప్రతి ఒక్కరు ఆశ్రమానికి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ జిల్లేపల్లి వినయ్ తదితరులు పాల్గొన్నారు.