ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రతి రైతు తమ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం తమకున్నటువంటి వ్యవసాయ భూమిలో ఒక అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య ( గోపి) ఆదివారం మండల కేంద్రంలో ఇంటింటికి వెళ్లి ప్రకృతి వ్యవసాయం పై ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయని దానికి అనుగుణంగా పెట్టుబడులు కూడా అధికంగా పెరిగాయని దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. అలాగే గత 60 ఏళ్లుగా రసాయన వ్యవసాయంతో భూసారం దెబ్బతినడంతో పాటు, అనేకమంది రోగాల పాలవుతున్నారు. కాబట్టి మన భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే తమ కుటుంబ అవసరాల కోసం ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరారు.అలాగే వ్యవసాయ భూమి లేని వారు తమ ఇళ్లల్లో పెరటి తోటలు పెంచుకోవాలని, ప్రకృతి వ్యవసాయంలో భాగంగా భూసారం పెంచేందుకు జీవామృతం ఉపయోగం, చీడపీడల నివారణకై పలు కషాయాలు ద్రావణాల తయారీ పై అవగాహన కల్పించారు.