పౌష్టిక ఆహారమే పసిపిల్లల ఆరోగ్యానికి శ్రీరామరక్ష-రేగొండ సూపర్వైజర్ సంధ్య

ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
పిల్లల శారీరక అభివృద్ధికి సరైన పోషకాలు అందించినప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని ఐసిడిఎస్ రేగొండ సూపర్వైజర్ సంధ్య పేర్కొన్నారు,శుక్రవారం రేగొండ మండల కేంద్రంలోని పోషణ మహోత్సవం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా నాలుగవ అంగన్వాడి కేంద్రంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరమని, చిన్నారులు ఆరోగ్యం గా ఉంటారన్నారు.పోషణ అలవాట్ల గురించి,శుద్ధి చేసిన తాగునీరు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.పిల్లల ఎదుగుదల శారీరక మానసిక వికాసం కోసం అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు నామాల రజిత,బొట్ల విమల,బండి ఉమ,మడగాని సుజాత,అయా శ్రీలత,తల్లిదండ్రులువేణు,నాగరాజు,సత్యనారాయణ,హేమంత్,సిద్దార్థ,ఆనంద్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.