
అంగన్వాడీ కేంద్రములో అక్షరాభ్యాస కార్యక్రమము
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలము రామన్న గూడెం తండా అంగన్వాడీ కేంద్రములో అక్షరాభ్యాస కార్యక్రమము జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కామిడి సతీష్ రెడ్డి,కుసుమ వెంకటేశ్వర్లు పలకల మీద ఓం అనే అక్షరాలను పెట్టించి చిన్నారు లచే దిద్ధించారు.పిల్లలు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.అదే విధంగా చేతుల శుభ్రత మీద అవగాహన కల్పించారు.చేతులను కడిగే విధానాన్ని అంగన్వాడీ సూపర్ వైజర్ కే.రమా దేవి పిల్లల చేతులకు హ్యాండ్ వాష్ పెట్టీ అందరితో కడిగే విధానాన్ని వివరించారు.భోజనానికి ముందు చేతులు సబ్బు తో కడిగి శుభ్రత పాటించాలి అని అన్నారు.అంగన్వాడీ టీచర్ బుర్ర సరస్వతి,యే. యన్.యం సదాలక్ష్మి,ఆరోగ్య కార్యకర్త అనిత,ఆయా అశ్లి ,తల్లులు లక్ష్మి,ప్రియాంక,అనూష,రేణు,రజిత,అంజలి,ప్రవలిక పిల్లలు పాల్గొన్నారు.