
అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టిన సర్పంచ్
నడిగూడెం గ్రామంలో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టినట్లు సర్పంచి గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం గ్రామంలో గల వీధులలో, కాలువలలో రోడ్లకు ఇరువైపులా దోమల మందు పిచికారి చేపించినట్లు తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో గ్రామ పంచాయతీ సిబ్బంది తో బ్లీచింగ్ పౌడర్ చెల్లించారు. గ్రామ ప్రజలు అంటు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు