
అకాల వర్షానికి కూలిన ఇల్లు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కోదాడ పట్టణంలోని 34 వ వార్డులో నివాసం ఉంటున్న సోమపంగు సామ్రాజ్యం ఇంటి పై కప్పు అర్ధరాత్రి కూలింది. శిథిలావస్థలో ఉండి పాత ఇల్లు కావడంతో వర్షానికి నాని ప్రమాదకరంగా ఉండటం ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ 34వ వార్డు ఇన్చార్జ్ గంధం పాండు రెవెన్యూ అధికారులకు వెంటనే సమాచారం అందించారు. బాధిత ఇల్లును ఆర్. ఐ నగేష్ పరిశీలించి పంచనమ చేశారు. నివేదికను ప్రభుత్వానికి పంపించి వీలైనంత తొందరలో పరిహారం అందే విధంగా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చీమ శ్రీను, మాజీ వార్డ్ మెంబర్ కుడుముల చిన్న వెంకయ్య, మాజీ ఎంపీటీసీ కాసర్ల సత్యవతి, కలకొండ గోపయ్య, కర్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.