అన్ని ఎన్నికలలో టీడీపీ ఒంటరి పోరు
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలo మర్లపాడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కేతినేని హరీష్ మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వేంసూరు మండలంలో ఉన్న అన్ని గ్రామశాఖల బాధ్యులు పాల్గొన్నారు.జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంటుందన్నారు.ఒంటరి పోరుకు పసుపు
దళం సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు.ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉండి పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో:మోరంపూడి చంద్రశేఖర్,భీమిరెడ్డి మురళీ రెడ్డి, పోట్రూ రామారావు,మోరంపూడి సుబ్బారావు,తోట పుల్లారావు,ఇమ్మడి మల్లేశ్వరరావు,మారేష్,ఎండీ బోలా,కొణిజర్ల రాంబాబు,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.