
శనివారం అమావాస్య తిథి అన్నదానం
ఈ69న్యూస్ జఫర్ఘడ్:సమాజంలోఅన్ని దానాలలో కెల్లా అన్నదానం ముఖ్యమైందని ఆర్యవైశ్య మహాసభ జనగాం జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ అన్నారు.జనగామ జిల్లా జఫర్ గడ్ మండల ఆర్యవైశ్య సంఘం నేతృత్వంలో
శనివారం అమావాస్య తిథి భోజనాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ..సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ముందుండడం హర్షణీయమైన విషయమన్నారు.సమాజంలో ఏ సేవ చెయ్యాలన్న ముందు వరసలో ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహాసభ ప్రధాన కార్యదర్శి గన్ను నర్సింహులు,కోశాధికారి బిక్షపతి,మండల అధ్యక్షులు అంచూరి యుగంధర్,ప్రధాన కార్యదర్శి దాంశెట్టి సోమన్న,కోశాధికారి
ఇమ్మడి అశోక్,గందెసోమన్న,బోనగిరి శ్రవణ్ కుమార్,నాగరాజు రేవూరి శ్రీనివాస్,బెలిదె హరిశంకర్,గందె సీతారాములు,దాంశెట్టి రామయ్య,సంతోష్,సుధీర్,దొడ్డ రాజు.మురళి రమేష్ తదితరులు పాల్గొన్నారు.