
ఈ69న్యూస్ ధర్మసాగర్ అక్టోబర్ 7
ధర్మసాగర్ మండలం,నారాయణగిరి గ్రామానికి చెందిన వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళితే దేవరుప్పుల బిక్షపతి,తండ్రి వెంకటమల్లు,వయస్సు(42) కుమ్మరి కులానికి చెందిన వ్యక్తి,వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.గత కొద్ది రోజుల నుండి వ్యవసాయ ఖర్చులు అధికమవడంతో పాటు,గత నాలుగు నెలలుగా అనారోగ్య సమస్యల కారణంగా చికిత్సకు డబ్బులు ఖర్చు అవగా, మృతుడు బిక్షపతి కి ఆర్థిక ఇబ్బందులు అధికం అవ్వగా,ఈ ఆర్థిక ఒత్తిడులు,మనోవేదన కారణంగా అక్టోబర్ 06 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుండి బయలుదేరి,తమ వ్యవసాయ బావి వద్ద రాత్రి 08 గంటలకు మోదుగు చెట్టుకు ఉరి వేసుకొని మృతిచెందగా,మృతుని భార్య దేవరుప్పుల శ్రీలత (38) ఇచ్చిన ఫిర్యాదు ఇవ్వగా,పిర్యాదుపై ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.