
telugu galam news e69news local news daily news today news
– పాపను మీడియా ముందు ప్రవేశపెట్టకపోవడంలో ఆంతర్యం ఏమి… – అధికారుల తీరుతో బేజారు.. – గేటు ముందు రెండు గంటల పడిగాపు కాసిన విలేకరులు. భద్రాచలం దత్తత పాప విషయంలో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా అనే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికారులు చెప్పే విషయానికి, పాప తల్లి ఇచ్చిన రెండు రకాల స్టేట్మెంట్ కు అనేక వైరుధ్యాలు కనపడడం ఆశ్చర్యకరం. ఐ సి డి ఎస్, సి డబ్ల్యు సి, పోలీసు అధికారుల విభిన్న మైన తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఆరు నెలల పాపను అధికారులు నాలుగు నెలల పాప అని పలుమార్లు ఉచ్చరించడం వెనకాల ఏమి జరిగింది. భద్రాచలం ఐఎంఏ నుండి అధికారులకు భారీ గానే ముడుపులు ముట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇటువంటి విచిత్రమైన సంఘటనలు జరగడం క్షమించరాని నేరం. తక్షణమే జిల్లా అధికారులు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చే వారిపట్ల తగు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద వ్యవహారం నడుస్తున్న CDPO నవ్య గారు కొద్ది రోజుల నుండి భద్రాచలం శిశు గృహ కు రాకపోవడం వెనకాల ఆంతర్యమేమి. పాపను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి SNCU కి తరలించిన అధికారులు.