
తేదీ 7 12 2022 ఆర్మూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా అనంతరం తాసిల్దార్ వేణుగోపాల్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సిపిఎం ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ ఆర్మూరు పట్టణముతో పాటు మండలంలో ప్రభుత్వ అసైన్మెంట్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు పెట్టి లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారని అన్నారు ప్రభుత్వ అసైన్మెంట్ భూమిని కొంతమంది ముఖ్య నాయకులు ప్రభుత్వ అసైన్మెంట్ భూమిని ప్లాట్లు చేసి ఇంటి నంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయిస్తూ ప్లాట్లను అమ్ముకుంటున్నారు అయినా ప్రభుత్వం అధికారులు నిమ్మకు నేరెత్తన్నట్టు వదిలేస్తున్నారు ప్రభుత్వం సాగుకు ఇచ్చిన అసైన్మెంట్ భూమిని రియల్ ఎస్టేట్ చేయటానికి వివో జారీ చేశారా అని అధికారులను అడిగారు అసైన్మెంట్ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాకుండా ప్రభుత్వ అవసరాల కోసం పేద ప్రజల కొరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అసైన్మెంట్ భూమిని ప్లాట్లు పెట్టి ఇంటి నంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఏ రకంగా చేస్తున్నారని ,అలా చేస్తున్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు ప్రభుత్వ చెరువులు, ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేసిన అధికారుల దృష్టికి తీసుకువచ్చిన చూసి చూడనట్టు వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పేద ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే హుటాహుటిన అధికారులు పేదలను తొలగించాలని చూస్తున్నారు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న ఏమి చేయకుండా వదిలేయటం ఏమిటని ప్రశ్నించారు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అన్నారు డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు గడువు పెంచాలని క్యాస్ట్ ఇన్కమ్ దరఖాస్తులు వారికి వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని తాసిల్దార్ కు తెలపడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు తోగాటి భూమన్న, సిపిఎం సభ్యులు కుల్దీప్ శర్మ దండవుల సాయిలు ,సాకలి రాజన్న, మస్రత్ బేగం ,షబానా బేగం ,లక్ష్మి , సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారుఇట్లు పల్లపు వెంకటేష్ సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి