అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో హఫ్తా మాల్ ప్రోగ్రాం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అహ్మదీయ్య ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో శనివారం మగ్రిబ్ నమాజ్ అనంతరం హఫ్తా మాల్ ఇజ్లాస్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఇస్లాం మతంలో ఆర్థిక త్యాగాల ప్రాధాన్యం మరియు జమాత్ అహ్మదీయ్యా సభ్యులు చేసే ఆర్థిక త్యాగాల ఉదాహరణల గురించి వివరించారు.అదేవిధంగా,జగతికి శాంతి మరియు మానవతా సేవల పట్ల ఇస్లాం అందించే బోధనలు కూడా వివరంగా చర్చించారు.అనంతరం తాత్కాలిక సర్కిల్ ఇంచార్జి మౌల్వీ ముజఫర్ పాషా మాట్లాడుతూ..ఆర్థిక త్యాగాల ద్వారా మనిషి హృదయంలోని స్వార్థాన్ని తొలగి సమాజానికి సేవ చేయాలనే భావన కల్గుతుందని అన్నారు.జమాత్ అహ్మదీయ్యా సభ్యులు తమ సంపాదనలో భాగాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం ద్వారా నిజమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు,అని పేర్కొన్నారు.ఈ సమావేశానికి కామారెడ్డి అధ్యక్షులు అహ్మదుల్లాహ్ అధ్యక్షత వహించగా,జిల్లా సెక్రటరీ మాల్ ఫహీమ్,మునీర్,నిసార్,గులామ్ మహ్మద్,తల్హా,ముసవ్విర్, ఫైజాన్,మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.