
ఆకుల పెంటయ్య విగ్రహ స్తూప ఆవిష్కరణ సభలో నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ MLC అలుగుబెల్లి నర్సిరెడ్డి
….తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ ఆకుల పెంటయ్య గారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని జనగామ పట్టణం లోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఆకుల పెంటయ్య గారి విగ్రహాన్ని, స్థూపాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కామాక్షి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షత వహించగా అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జనగామ జిల్లా విప్లవలకు పుట్టినిల్లుగా ఏ
గ్రామానికి వెళ్లిన అనేక త్యాగాలు చేసి అమరులైన అమరవీరుల స్థూపాలే స్వాగతం పలుకుతాయని అన్నారు. జనగామ ప్రాంతంలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన ఆకుల పెంటయ్య సిపిఎం పార్టీ నుండి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రజలకు అనేక సేవలు అందించారని షాప్స్ అండ్ గ్రీన్ మార్కెట్ హమాలి యూనియన్ స్థాపించి కార్మిక హక్కుల సాధన కోసం తన
జీవితాంతం పనిచేశారు.
సమరయోధులు సాధించిన స్వతంత్ర ఫలాలు నేడు భావితరాలకు అందకుండా ఈ పాలకవర్గాలు దోపిడి వర్గాలకు ఉపయోగపడే విధంగా విధానాలను కొనసాగిస్తూ ముఖ్యంగా విద్యా వైద్యం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమ మయ్యారు అన్నారు.
పెంటయ్య గారి స్ఫూర్తి జనగామ ప్రజానీకం హక్కుల కోసం ఉద్యమించాలన్నారు.
అనంతరం సిఐటియురాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్
పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారాలను మోపుతూ ప్రభుత్వ రంగ సంస్థలనుప్రైవేటీకరణ చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాల అవలంబిస్తూ కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు సక్రమంగా ఇవ్వకుండా ప్రశ్నించే వారిని
అణచివేస్తూ పాలన కొనసాగిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కరించకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆదివాసులు గిరిజనుల
దళితులపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యకులను కేంద్ర ప్రభుత్వం అంచివేస్తుంది.
కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు తీసుకొని ఎన్నికల్లో కోట్ల డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో బిజెపి అవినీతి పద్ధతిలో గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారిపై పాశవికంగా దాడులు చేస్తూ కేసులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
గుడిసెలు వేసుకున్న వారందరికీ పట్టాలిచ్చి ఐదు లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నిటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల పెంటయ్య గారి కుటుంబ సభ్యులు ఆకుల శ్రీనివాసరావు ఆకుల వేణుగోపాలరావు దేవులపల్లి మల్లికాంబ తోపాటు
పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ యాదగిరి
ఆర్ రాజు E అహల్య ఎస్ రమేష్ ఆర్ సోమయ్య
జి బాబు రెడ్డి
జిల్లా కమిటీ సభ్యులు ఎస్ విజేందర్ బి చందు నాయక్ బి నరేందర్ పి నాగరాజు సిహెచ్ సోమన్న రమేష్ కే యాకయ్య ఎండి షబానా మండల కార్యదర్శి జి మహేందర్ ఎస్ రమేష్ పి నర్సింహులు
సీనియర్ నాయకులు ఎండి దస్తగిరి బండయ్య సిఐటి జిల్లా అధ్యక్షులు పట్ల శ్రీనివాస్
కే లింగం జి ఎల్ ఎన్ రెడ్డి తోపాటు……..
కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాపరెడ్డి
మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల
సత్యనారాయణ రెడ్డి
లోకమంతా రెడ్డి ఆలేటి సిద్ధిరాములు పాల్గొన్నారు.