ఇసుక అక్రమ వ్యాపారం అందులో పొత్తులు కుదరక మారణాయుధాలతో దాడులు.ఇసుక రవాణా విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.మాచినపల్లి, తానంచర్ల పరిధిలోని ఆకేరు వాగు నుంచి వందల సంఖ్యలో రాత్రి,పగలు అక్రమ ఇసుక రవాణా.మరిపెడ మండలం మూలమర్రి తాండ ,తానంచర్ల, గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ తిరుమలాయపాలెం మండలం ముజాహిద్ పురం ట్రాక్టర్ ఓనర్లకు అమ్మకాలు.ముజాహిద్ పురంలో పదులకొద్ది డంపింగ్ యార్డులు ముజాహిద్ పురంలో డంపింగ్ చేసే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.పలమార్లు ఒకే వ్యక్తికి ఇసుక విక్రయించడంతో గొడవపడ్డ ట్రాక్టర్ డ్రైవర్లు.ముజాహిద్ పురం పుల్లూరు మధుకు తీవ్ర గాయాలు.రక్తపు మడుగులో పుల్లూరు మధు.. చికిత్స నిమిత్తం ఖమ్మం తరలింపు మరిపెడ బంగ్లా, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన కొందరు అక్రమ ఇసుక మాఫియా దారులు కుమ్మక్కై అధికార పార్టీ నాయకులు అండదండలతో అక్రమ ఇసుక రవాణా నడుస్తున్నట్లు ప్రజల ఆరోపన.అక్రమ ఇసుక రవాణా పై పలుమార్లు పత్రికలలో వచ్చిన పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ అధికారులు.అక్రమ ఇసుకదారులంతా హోలీ పర్వదినాన మారణాయుధులతో ఘర్షణ.భయాందోళనలో పలు గ్రామాల ప్రజలు.తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో పుల్లూరు మధు ఫిర్యాదు.