ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా-సర్పంచ్ అన్నం స్వప్నరాణి బ్రహ్మారెడ్డి
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్,ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నం స్వప్నరాణి బ్రహ్మారెడ్డి,ఉపసర్పంచ్ ముక్కెర గంగరాజుతో పాటు వార్డు సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో సర్పంచ్ అన్నం స్వప్నరాణి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ..తమ్మడపల్లి జి గ్రామాన్ని రాష్ట్రానికే కాకుండా ఢిల్లీలో కూడా గుర్తింపు పొందేలా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు.గత సర్పంచులు చేపట్టిన అభివృద్ధి పనులు అభినందనీయమని పేర్కొంటూ,గ్రామాన్ని అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు,అధికారులు,గ్రామ ప్రజల సహకారంతో నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని,ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలో గ్రామానికి చెందిన ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జనవరి నెలలో క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు గుజ్జరి రాజు,మారేపల్లి ప్రభాకర్,అన్నెపు పద్మా అశోక్,చిట్టిమల్ల క్రిష్ణమూర్తి,మాజీ ఉపసర్పంచ్ శరీఫుద్దీన్,సీపీఎం నాయకులు రాపర్తి రాజు,సోమయ్య,గుండె బోయిన రాజు,షబానా షంషుద్దీన్,ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.