ఆపదలో నిత్యావసరాలను అందించిన మాజీ ఎంపీపీ అరుణ
ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఏరు ఉధృతి పెరగడంతో బిక్కుబిక్కుమంటు తెల్లవారి వరకు నరకం చూసిన తండా గ్రామవాసులు ఆకేరు వాగు పొంగి వరదలకు తీవ్రంగా నష్టపోయిన మరిపెడ మండలం తండ ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలోని సీతరాంతండలో 46 ఇండ్లు పూర్తిగా నీట మునిగాయి 1989 తర్వాత ఇంతటి ఉప ధ్రువం తమ గ్రామంలో ఎప్పుడు చూడలేని విధంగా ఇప్పుడు మరింత అధికంగా ప్రభావం ఉన్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. తండావాసుల దుస్థితి చూసి జాలి కలిగిన మాజీ ఎంపీపీ అరుణ రాంబాబుకి తన వంతు సహాయంగా
తండా ప్రజలకు 25 కేజీల రైస్ బ్యాగ్, 1000/-రూపాయల నగదును అందజేశారు వారి వెంట వెంకన్న మాజీ సర్పంచ్ బాబు నాయక్, బానోత్ భిక్కు,లక్పతి,హచ్చు, బాలకిషన్,స్వామి గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.