
ఆరవ రోజుకు చేరుకున్న ఏఎన్ఎం ల సమ్మె
సెకండ్ ఏఎన్ఎంలపై కేసీఆర్ ది సవితి తల్లి ప్రేమ సరికాదని ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్, సెకండ్ ఏఎన్ఎం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు గోపు సుజాత అన్నారు.శ్రావణ సోమవారమును సైతం లెక్కచేయకుండా బోనాలతో సెకండ్ ఏఎన్ఎంలు ఏకశిలా పార్కు వద్ద సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ కష్టం అయినప్పటికీ,ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలోగాని, రాష్ట్రానికి అవార్డులు తీసుకురావడంలో గాని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంల పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. ఏఎన్ఎంలను అందరిని ఎలాంటి షరతులు లేకుండా భేషరతుగా రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని అన్నారు,ఏఎన్ఎం లకు ఉద్యోగ భద్రత కల్పించాలని,ప్రమాద భీమా 50 లక్షలు ఇవ్వాలని,దురదుష్టవత్తుఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు,కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని,ఉద్యోగులపై కేసీఆర్ ది సవితితల్లి ప్రేమ సరికాదని అన్నారు,సమస్త ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అసెంబ్లీలో, వేదికలపై ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మోసం చేస్తున్నారని అన్నారు, క్రమబద్దీకరణ డిమాండ్‌పై రెండో ఏఎన్ఎంలు AITUC ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్న ముఖ్యమంత్రి పట్టిచుకోకుండా,ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని అన్నారు, ఎన్నికల సమయంలో మరియు ఉద్యమ సమయంలో కేసీఆర్ కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు,ఆంధ్ర పరిపాలనలో కాంట్రాక్టు వ్యవస్థను బానిస వ్యవస్థతో పోల్చిన కెసిఆర్. ఇప్పుడు అంతకన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో ఏఎన్ఎంలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో అత్యంత కీలకపాత్ర పోషించాలని అన్నారు దేవుళ్లతో సమానంగా పోల్చిన కేసీఆర్ ఇప్పుడు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు, ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన మాత్రమే చేస్తుందని సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశం లేదని అన్నారు, కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఎలాంటి షరతులు లేకుండా భేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పథకాల అమలుకోసం వాడుకుంటుందే తప్ప వారికి చట్టబద్దంగా అమలు కావాల్సిన సదుపాయాలు, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. హామీలు అమలు చేయకుండా మహిళా ఉద్యోగులను రోడ్లెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. గత 20 సంవత్సరాలుగా రెండో ఏఎన్ఎం హోదాతో ప్రజలకు వైద్యసేవలందిస్తూ ఎంతో అనుభవం ఉన్న మహిళా సిబ్బందిని వైద్యశాఖ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా ఉద్యోగ ప్రకటన విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్లను క్రమబద్దీకరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటనను అమలు చేయాలని, హక్కులు అమలు చేయాలని రెండో ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. చర్చల పేరుతో కాలాయాపన చేయకుండా ఏకైక డిమాండైన క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎంలు కొంగర సాలమ్మ చంద్రకళ లలిత నాగలక్ష్మి రజిత శ్వేత సుజాత జ్యోతి కరుణ లలిత లలిత, వరంగల్ జిల్లాలోని సెకండ్ ఏఎన్ఎంలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.