
ఆర్ఎస్ఎస్ -బీజేపీ ఫాసిస్ట్ శక్తులను ఓడిద్దాం
హైదరాబాద్ ఓంకార్ భవనంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మా.లె) రివల్యూషనరీ ఇనీషియేటివ్ సెంట్రల్ కమిటీ సమావేశాలు జరి గాయి. దేశంలోని వివిధ తీవ్రమైన పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ -బిజెపి లు2024 లో జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు వాటి మతతత్వ విభజన ను తీవ్రంగావిస్తూ కార్య క్రమాలు నిర్వహిస్తున్నాయ ని పార్టీ కేంద్ర కార్యదర్శి ప్రదీప్ సింఘా ఠాకూర్ మండిపడ్డారు.మణిపూర్‌లోని మెయితీలు మరియు కుకీ తెగల మధ్య శతాబ్ద కాలంగా ఉన్న సోదర తత్త్వాన్ని, ఐక్యతను నాశనం చేశాయని, హర్యానాలో ముస్లింలపై దాడులను విస్తృతం చేయ డమే గాక, మత విభజన ను వ్యాప్తి చేయడానికి గ్యామ్ బాపిని మసీదును లక్ష్యంగా కుట్రలు చేస్తుంద ని దుయ్యబట్టారు. ప్రజల మౌళిక సమస్యలను పరిష్కరించడంలో విఫల మైన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్లను సంతృప్తి పరచడానికి, అటవీ సంరక్ష ణ చట్టం 2006 ను పలుచ న చేసిందని ఎత్తి చూపా రు. ప్రజల దృష్టిని వారి బాధల నుండి మళ్లించ డానికి, ఫాసిస్ట్ మత విద్వేషాన్ని, విభజించి పాలించు విధానాన్ని అవ లంబిస్తున్నదని, హేయమైన డిజైన్ యూనిఫాం సివిల్ కోడ్ ఈకోవకే చెందిందని అన్నారు. 26 ప్రతిపక్ష రాజకీయ పార్టీల కూటమి ఇండియా ఏర్పాటును తమ పార్టీ స్వాగతిస్తుందని గుర్తు చేశారు. రెండు రోజులు జరిగిన సమావేశం లో బీజేపి,ఆర్ఎస్ఎస్ పాలన యొక్క మత ద్వేషాన్ని బట్టబయలు చేస్తూ 2023, ఆగస్టు చివరి వారమంతా దేశమంతటా నిరసన కార్యక్రమాలు నిర్వ హించాలని, ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులక కు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, వామపక్ష విప్లవశక్తులు ఐక్యం కావాలని తదితర తీర్మానాలు చేశారు. 13 రాష్ట్రాలకు సంబంధించిన వెస్ట్ బెంగాల్ ప్రదీప్ సింఘా ఠాగూర్, న్యూఢిల్లీ ఉమా కాంత్, ఉత్తర్ ప్రదేశ్ విమల్, ఆంద్రప్రదేశ్ జోసఫ్, మహరాష్ట్ర ప్రవీణ్ నడ్కార్, కేరళ రవి పాలూ ర్, కర్నాటక పుజార్, నిర్వహణప్ప, తమిళనాడు మన్నార్, ఒరిస్సా వివేక్, కోల్ కత్త బాంగర్ సుక్లా, జార్ఖండ్ అనిల్ మిశ్రా తెలంగాణ సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4,5,6తేదీలలో జరిగిన సిపిఐ(ఎంఎల్) ఆర్ఐ, సిపిఐ(ఎంఎల్) ప్రజాపందా, పిసిసి సిపిఐ (ఎంఎల్) మూడు విప్లవ సంస్థల ఐక్యతా చర్చలు పలించాయని చెప్పారు. నిన్న నేడు 11,12 తేదీలలో కాశాయ, కార్పోరేట్, మను వాద, ఫాసిస్టు పాలనను వ్యతిరేకించే ఇతర విప్లవ సంస్థలు సిపిఐ(ఎం.ఎల్) రెడ్ ప్లాగ్, సిపిఐ(ఎం.ఎల్) ప్రతిఘటన, యుసీసీఆర్‌ఐ (ఎం.ఎల్) పూర్వ నాయకు లు జి.ఎస్.ఎన్ రెడ్డి తది తరులతో ఐక్యతా చర్చలు జరిగాయని సిపిఐ (ఎం. ఎల్)ఆర్ ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు సిఓసి సభ్యులు కామ్రేడ్ గడ్డం సదానందం తెలిపా రు.