
ఆర్టీఐ రక్షక్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ అష్రఫ్ కి డిప్యూటేషన్
ప్రశ్నిస్తున్నాడని గతంలో చేయని తప్పుకు అధికారులు సస్పెన్షన్ చేశారు. మళ్ళీ ఎటువంటి తప్పుచేయలేదని విధుల్లోకి తీసుకున్నారు. అలాగే అసిఫాబాద్ జెడ్పీఎస్ఎస్ లో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్టీఐ రక్షక్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ అష్రఫ్ గారిని జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం లోని డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీ గా డిప్యూటేషన్ పై నియమించడంతో శనివారం అష్రఫ్ గారు డీఈఓ అశోక్, డీసీఈబీ సెక్రెటరీ వెంకటస్వామి చేతుల మీదుగా ఉత్తర్వులను అందుకొని డీసీఈబీ అసిస్టెంట్ సెక్రెటరీ గా బాధ్యతలు స్వీకరించారు