
telugu galam news e69news local news daily news today news
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ కార్య నిర్వహణ అధికారి బదిలీని వ్యతిరేకిస్తూ భద్రాచలంలో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు.
భద్రాచలం ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎల్ రమాదేవిని కీసర ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు.
ఆలయ ఈ ఓ రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలని, గతంలో అభివృద్ధి లేక నిధులు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆలయానికి ఈఓ వచ్చిన తర్వాత ఆదాయం గణనీయంగా పెరిగిందని నినాదాలు చేశారు.
నల్ల బ్యాడ్జీలతో ఆలయ అర్చకులు నిరసన
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం కార్యనిర్వహణ అధికారి కార్యాలయం ముందు ఈవో బదిలీని నిలిపివేయాలని నిరసన వ్యక్తం చేసిన ఆలయ అర్చకులు ఉద్యోగులు.. నల్ల బ్యాడ్జీలతో నిరసన చేసిన ఆలయ అర్చకులు ఉద్యోగులు.
రమాదేవి గారు వచ్చిన తర్వాత పురుషోత్తపట్నం ఆలయ భూములపై పోరాటం చేశారని, చాలా యేళ్ల నుంచి పేరుకుపోయిన చెత్తను ప్రక్షాళన చేస్తున్నారని అన్నారు.