
telugu galam news e69news local news daily news today news
ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం గళం న్యూస్ ఆలేరు ఆలేరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్లో జరిగిన ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ..ఓటమి పాలైనా కృంగి పోవాల్సిన అవసరం లేదు,గెలుపోటములు సహజమన్నారు.తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చేసిన పనులు కళ్ళముందే కనపడుతున్నాయన్నారు.కాంగ్రెస్ పార్టీ పెట్టిన హామీలు వీలు కానీ హామీలని,ఆరు గ్యారెంటీ పథకాలు అన్నారు,కానీ అవి 420 పథకాల హామీలన్నారు.రేవంత్ మాట మీద నిలబడేవాడైతే 100 రోజుల్లో పెట్టిన హామీలు అమలు చేసి ఓటు అడగాలన్నారు.ముఖ్య మంత్రి అయినాక తొలి సంతకం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని,రైతుబరోసా కింద 15000 రూపాయల రైతు బంధు ఇస్తామన్న హామీ ఇంకా అమలు కాలేదన్నారు.పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మన ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించ లేదు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ప్రాజెక్టులను అప్పగించి సంతకం పెట్టింది.రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిందని ఎద్దేవా చేశారు.రేవంత్‌కు ఆలోచన లేక,అర్థం కాక ఆగమాగమై చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.రాష్ట్రానికి నీటి సమస్యలను తీసుకొస్తున్నాడు.ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే ఖమ్మం,నల్లగొండ,మహబూబ్ నగర్‌లకు సాగు నీరు,తాగునీటికి సమస్య వస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడూ అలాగే మాట్లాడుతున్నారని అన్నారు.భువనగిరి ఎంపీ స్థానాన్ని మనం తప్పకుండా గెలవాలి.ఢిల్లీలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాలంటే ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలి.తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది ఒక్క బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని,ఎంపీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలి. పట్టుదలతో పనిచేయాలన్నారు.అనంతరం ప్రమాద వశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత,నల్గొండ జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మహేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య ,మరియు ప్రజాప్రతినిధులు,బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.