ఆశీర్వదించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
రాంపురం గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ ఎన్నికలలో పుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించండి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండ్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పెండ్లి శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా గ్రామ నాయకులు, కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిధి గా ప్రభుత్వ విప్, రామచంద్ర నాయక్ పాల్గొని ప్రచారం నిర్వహించరు,ఈ సందర్బంగా పెండ్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామం వెనుకబడిందని వాపోయారు. గ్రామం అభివృద్ధి చెందాలన్న. గ్రామ సమస్యలు పరిష్కారం కావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల గ్రామంలో ప్రతి ఇంటికి వెళితే ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వం దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లలేరని గ్రామంలో ఏ రకంగా అయినా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండదని కావున గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధి నీ దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలు గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలని, మన గ్రామ అభివృద్ధి మన చేతుల్లోనే ఉందనీ కావున పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నన్ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ సహకారంతో గ్రామ అభివృద్ధిని సాధిస్తానని తెలిపారు. వారితో పాటు ప్రచార ఈ కార్యక్రమంలో ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డిమండల మండల పెండ్లి రఘువీరారెడ్డి, సొసైటీ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి సొసైటీ చైర్మన్, మాజీ సర్పంచ్ రాంలాల్, అంబరీష, అఫ్జల్ బోర హరీష్ యాదవ్ రాంపల్లి రంజిత్, రాంపల్లి వీరాంజి గౌడ్, జక్కోజు సురేష్, ధోనిపెల్లి కృష్ణ, దిద్ది చెంద్రశేఖర్, రాంపెల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.