
ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఈ69న్యూస్ హనుమకొండ
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సోమవారం సందర్శించారు.ఈ పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఏర్పాట్లను గురించిన వివరాలను స్థానిక అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.పరీక్షా కేంద్రంలో పరీక్ష జరుగుతున్న తీరును కలెక్టర్ తనిఖీ చేశారు.పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య వివరాలను,పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పరీక్షా కేంద్రంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.