ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్‌పేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం సందర్శించారు.ఇంటి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి అని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీహరి,ఇంటి యజమానిని అభినందిస్తూ ₹5,000/-లను బహుమానంగా అందజేశారు.ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల నిర్మాణం నాణ్యతగా పూర్తయ్యేలా అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో,మాజీ జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్,స్థానిక నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు.