ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు
భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
“ఇందిరా గాంధీ ధైర్యం–నిర్ణయాలకు ప్రతీక”
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇందిరా గాంధీ భారత రాజకీయాల్లో ధైర్యానికి ప్రతీకగా నిలిచారని,దేశ ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న దూరదృష్టి గల నాయకురాలని అన్నారు.సామాన్య ప్రజల జీవితం మెరుగుపడాలని ఆమె చేసిన కృషి అపారమని తెలిపారు.దేశాన్ని ముందుకు నడిపించడానికి అవసరమైన నిబద్ధత,స్పష్టత,క్రమశిక్షణ ఇందిరా గాంధీ వ్యక్తిత్వంలో ప్రత్యేకతగా నిలిచాయని చెప్పారు.ఉక్కు మహిళగా గుర్తింపు పొందిన ఆమె దేశ అభ్యున్నతికి ఎన్నో నూతన సంస్కరణలు అమలు చేశారంటూ కొనియాడారు.కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ సెక్రెటరీ శశిజాదేవి,మాజీ కార్పొరేటర్ ఆనంద్,సీనియర్ బొమ్మతి విక్రమ్,నలుబోల సతీశ్,శ్రీనివాస్,గ్రంథాలయ పాలకులు మల్సూర్,సంతోష్,పురుషోత్తంరాజ్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.