
బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో క్రిస్టి న్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నరేందర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… ఉపవాసం పాటించటం మన దైవ భక్తిని పెంపొందించుకోవడమే అని అన్నారు.ఉపవాస విరమణ సమయంలో జరిగే ఇఫ్తార్ విందు కేవలం భోజన సమయమే కాదు,ఒకరికొకరు ప్రేమతో మమకారంతో కలిసే పవిత్ర సమయము అని అన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం మైనారిటీ సోదరులు మరియు మత పెద్దలు మాజీ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
