
భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్న కాలనీవాసులు,సిపిఎం
ఈ69న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో గురువారం అంబేద్కర్ స్టార్చ్ దగ్గర సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను సిపిఎం పార్టీ,బైండ్ల కాలనీవాసులు పరిశీలించి అనంతరం నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలంటూ పెద్ద ఎత్తున నిదానాలు చేశారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకులు,గ్రామ కార్యదర్శి వడ్లకొండ సుధాకర్ కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడుతూ..డ్రైనేజీ ప్రణాళిక బద్ధంగా నిర్మాణం చేపట్టకపోతే భవిష్యత్తులో తమ ఇండ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై నెల రోజుల క్రిందనే ఎంపీడీవో దృష్టికి వినతి పత్రం రూపంలో రూపంలో తీసుకెళ్లిన ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.అలాగే పంచాయతీ రాజ్ ఏ ఇ,డి ఈ గార్లకు ఫోన్ ద్వారా మరియు స్వయంగా కలిసి విషయాన్ని తెలిపినప్పటికీ విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుట్లో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సందర్శించి ప్రణాళిక బద్దంగా సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు.లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే అనర్థాలకు పంచాయతీరాజ్ అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో కాలనీవాసులు గాద కుమారు బైండ్ల బక్కయ్య అబ్బయ్య గాదే మహేందర్ జయమ్మ గంగమ్మ సోమ నరసమ్మ లచ్చమ్మ వెంకటమ్మ ఎల్లమ్మ నిర్మల ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.