
పంచాయతీ సిబ్బంది పాదయాత్రను జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం~~~~~
జనగామ: గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఈనెల 12న పాలకుర్తి నుండి పట్నం వరకు 28 వరకు జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి నారోజు రామచంద్రం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్
ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అహల్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి ఉపేందర్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్ల గణేష్ గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య
రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జోగు ప్రకాష్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పల్లెర్ల లలిత తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆజ్మీర సురేష్ గణేష్ ఆల్ అమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి బైరగోని బాలరాజు గౌడ్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు భాషాపాక విష్ణు ఐద్వా జిల్లా నాయకురాలు పందిళ్ళ కళ్యాణి ప్రజా సంఘాల నాయకులు పాల్గొని పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు
ఈనెల 12న 12 గంటలకు పాలకుర్తిలో జరిగే పాదయాత్ర ప్రారంభ సభకు గ్రామపంచాయతీ సిబ్బంది కార్మిక యూనియన్లు ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు
డిమాండ్స్
గ్రామ పంచాయతీ సిబ్బంది న్యాయమైన ఈ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు
1 జీవో నెంబర్ 51 సవరించాలి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి
2కారోబారు బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి
3 గ్రామపంచాయతీ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి
4 ఓ నెంబర్ 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు 16500 కారోబార్ బిల్ కలెక్టర్లకు 19500 కంప్యూటర్ ఆపరేటర్లకు 22,500 వేతనాలు చెల్లించాలి
5 ప్రమాద బీమా పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి
6 అధికారులకు అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి
7 దళిత బంధు పథకంలో పంచాయతీ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలి
8 పంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలు తక్షణమే ఇవ్వాలి
ఈ డిమాండ్ల సాధన కోసం రాజకీయాలకతీతంగా యూనియన్లకు అతీతంగా పంచాయతీ సిబ్బంది ఐక్యంగా పాదయాత్రలో పాల్గొనాలని కోరారు