
ఈ69 న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని నాయుడు పెట్రోల్ పంపు ప్రాంతంలో చెత్త-డ్రైనేజీ సమస్యలపై ఈ-69 న్యూస్ మరియు తెలుగు గళం న్యూస్ లో కథనం ప్రచురించబడిన వెంటనే అధికారులు కదిలారు.వారం రోజులుగా పేరుకుపోయిన చెత్త గుట్టలు,మూసుకుపోయిన డ్రైనేజీలు,దుర్వాసన-దోమల విపరీత సమస్యలపై ప్రజల ఆవేదనను మీడియా వెలుగులోకి తీసుకురావడంతో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించారు.శానిటేషన్ సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపించి చెత్త తొలగింపు,డ్రైనేజీ శుభ్రపరిచే చర్యలు చేపట్టారు.స్థానిక ప్రజలు మీడియా సహకారంతో తమ సమస్యలకు స్పందన లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.నెలల తరబడి మేము ఫిర్యాదు చేసినా వినిపించని అధికారులు,మీడియా రాసిన వెంటనే కదిలారు.ప్రజల గొంతుకగా నిలిచిన పత్రికలకు ధన్యవాదాలు”అని వారు పేర్కొన్నారు.అధికారులు ఇకపై ఇలాంటి సమస్యలు రాకుండా పర్యవేక్షణ బలపరిచే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.