
ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే
తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుతున్న సీఎం కేసిఆర్ దేశ చరిత్ర లో 91,142 ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే డోర్నకల్ యువనేత డీఎస్ రవిచంద్ర గారు నీళ్ళు, నిధులు, నియామకాల లక్ష్యంగా దశాబ్దాల కాంక్షను సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వము క్రమంగా నెరవేర్చుతొందని టిఆర్ఎస్ డోర్నకల్ యువనేత డీఎస్ రవిచంద్ర గారు అన్నారు.
ప్రభుత్వ నోటిఫికేషన్ పై అంసెబ్లిలో సీఎం కేసీఅర్ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లో మున్సిపల్ కేంద్రములోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపుడి నవీన్ రావు గారితో కలిసి సీఎం కేసీఅర్ గారి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.బానసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం , మల్లన్న సాగర్ తదితర ప్రాజెక్ట్ పూర్తి చేసి సమైక్య రాష్ట్రంలో జీవం కోల్పోయిన సాగు నీటి రంగానికి పునర్జీవం పోశారన్నారు.
నిరంతరం రాయితీ పై విద్యుత్ సరఫరా చేస్తూ రైతుబంధు ద్వారా పంట పెట్టుబడులు అందిస్తున్నారు. రాష్ట్రం లో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ముమ్మర మైన అభివృద్ధి చేస్తూ నేడు నిరుద్యోగులకు ఉద్యోగ నోటీఫికేషన్ వేసి తీపి కబురు అందజేశారన్నారు.
మరో రెండు దశాబ్దాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో అధికారం సుస్థిరం చేసుకొనుందన్నారు.