
ఉప్పుగల్లు ఎల్లమ్మ గుడిలో హుండీ చోరీ– గౌడ సంఘం నేతలు ఫిర్యాదు

ఈ69 న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ గుడిలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగలగొట్టి నగదు చోరీ చేశారు. ఆలయ భద్రత లేకపోవడమే దొంగలకు వీలు కల్పించినట్లు గ్రామస్థులు అంటున్నారు.ఈ ఘటనపై గౌడ సంఘం అధ్యక్షుడు కోరుకొప్పుల రాజు గౌడ్, ఉపాధ్యక్షుడు పులి ధనుంజయ గౌడ్, డైరెక్టర్లు బొలిపెల్లి రాజు గౌడ్,వడ్లకొండ మధు గౌడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. బాధ్యులను త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.