
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
ఎమ్మేల్యే గండ్ర సత్యనారాయణ రావు తన అహంకార పూరిత ప్రభుత్వ వైఖరిని మానుకొని విలేకరులకు క్షమాపణ కోరాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి డిమాండ్ చేసారు.మంగళవారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈనెల ఆదివారం విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గండ్ర సత్యనారాయణ రావు వెంటనే విలేకరులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జీతభత్యాలు లేకుండా వ్యయప్రాసాలకు ఓర్చుకొని ప్రజల శ్రేయస్సు కోసం నిస్వార్ధంగా సేవలందించే వారే జర్నలిస్టులని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచిన జర్నలిస్టుల పట్ల కనీస గౌరవం లేకుండా,తాను ఎమ్మేల్యే అన్న విషయాన్ని మరిచి ఒక సాధారణ కార్యకర్త ల నోటి కీ ఎంత వస్తే అంత మాట్లాడటం పదవిని సైతం కించపరచడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎమ్మెల్యే గండ్రకు నియోజకవర్గం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని అది స్థానిక సంస్థల్లో బహిర్గతం అవుతుందని భవిష్యత్ చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి,మండల ఉపాధ్యక్షుడు శివ కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్, బూత్ అధ్యక్షుడు చల్ల విక్రమ్, అంబటి రాజ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.