
హన్మకొండ కాంగ్రెస్ నాయకులు
.-హన్మకొండ కాంగ్రెస్ నాయకులు
నాయిని రాజేందర్ రెడ్డి ని విమర్శించే నైతిక అర్హత బిఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుస్,మాజీ కార్పొరేటర్ డిన్నా పత్రిక సమావేశంలో మాట్లాడారు.ఎమ్మెల్యే నాయిని రాజేందర్ సుదీర్గ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజల పక్షాన నిలిచిన నాయకుడన్నారు.
బి ఆర్ ఎస్ నాయకులు నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం లో గానీ,వరంగల్లు జిల్లాలో చేసింది ఏమీ లేదని,ఉద్యమం పేరుతో ప్రజలను మోసం చేశారని,యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారని అన్నారు.ఉద్యమాల పేరుతో ప్రజలను మోసం చేసిన మీరు కాంగ్రెస్ పార్టీని ,ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శిస్తే సహించేది లేదని అన్నారు.