
జనగామ: ప్రజా సమస్యల పరిష్కరించకుండా కుర్చీకి పరిమితమై పాలన సాగిస్తూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి తొత్తుగా మారి జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఇర్రి అహల్య పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ లు డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జనగామ చౌరస్తాలో కలెక్టర్ శివలింగయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ పట్టణంలోని మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్ల సమస్యను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురిచేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి తొత్తుగా మారి పరిపాలన సాగిస్తున్న జిల్లా కలెక్టర్ శివలింగయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇళ్లస్థలాల వద్ద రాత్రి అని లెక్కచేయకుండా గూడు కోసం వారందరూ అక్కడే చలిని సైతం లెక్కచేయకుండా వంట వార్పు ఏర్పాటు చేసుకొని బస చేస్తున్నారని వారన్నారు. గతంలో జనగాం జిల్లాలో పనిచేసే బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఆర్డీవో ,తాసిల్దార్ గారులు జనగామ పట్టణాని కి 560 డబల్ బెడ్ రూమ్ లు, మంజూరైనాయాని చెప్పి మీరు చిన్నగా నిర్మించు కున్న ఇండ్లను కూల్చి వెసి మాకు అప్పగించండి అంటు.లబ్ధిదారులకు చెప్పడంతో ఇండ్లను కూల్చి వారికి అప్పగించడం జరిగింది. ఇండ్లు పూర్తి కాగానే మీకే అప్పగిస్తామని చెప్పారు. కానీ లబ్ధిదారుల అనుమతి లేకుండా డబుల్ బెడ్ ఇండ్ల శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్టి విషయంలో గౌరవ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఇందిరమ్మ లబ్ధి దారులను ఎటువంటి “డిస్టప్’ చేయకుడదని జిల్లా కలెక్టర్ ను ఆదేశించడం జరిగిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి నాలుగున్నర సంవత్సరాలు దాటింది డబుల్ బెడ్ ఇండ్ల ప్రారంభించి నేటికి నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్న నేటికీ పూర్తికాలేదు అన్నారు కానీ జనగామ R.D.O. గారు దివి 12/02/2023 పత్రికలకు ఇక్కడ నిర్మిస్తున్న ఇండ్లను వార్డు సభలు పెట్టి ఎంపిక చేస్తామని ప్రకటన విడుదల చెయ్యడం జరిగింది. అధికారుల అవివేకానికి నిదర్శనం అన్నారు .గతంలో వార్డు సభల ద్వారా ఎన్నిక అయ్యిన పేదలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ శివలింగయ్య చేస్తున్నాడని ఆ ప్రయత్నాన్ని వెంటనే మానుకొవాలి సిపిఎం నాయకత్వం అధికారులు కలెక్టర్ ను కలిసి విషయం చెప్పే ప్రయత్నం చేస్తే కలెక్టర్ గత రెండు రోజుల నుండి అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని ఇప్పటికైనా కలెక్టర్ గారు పేదల పట్ల చిత్తశుద్ధితో మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల సమస్యను పరిష్కరించి వారికి కేటాయించిన స్థలాలను వారికి అప్పగించాలని లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు . స్థలంలో ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ పట్టణ కమిటీ సభ్యులు పల్లెర్ల లలిత బాల్నేవెంకట మల్లయ్య బోట్ల శ్రావణ్ పాముకుంట చందు తదితరులు పాల్గొన్నారు