
ఈ69 న్యూస్ జనగామ
ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)పింకేష్ కుమార్ సూచించారు.శుక్రవారం,జిల్లా కేంద్రంలోని పురపాలిక కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)పింకేష్ కుమార్ సందర్శించి,ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై ఆకస్మిక తనిఖీ చేసి సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..లేఅవుట్ క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని,అప్రోచ్ రోడ్,ప్లాట్ల మధ్య రోడ్లు సరిగా ఉండేలా పరిశీలించాలన్నారు.పట్టణ ప్రణాళిక అధికారులు ముందుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సంబంధిత భూములను గుర్తించాలన్నారు.అధికారులందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించారు.ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,ఇతర సంబంధిత అధికారులు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.