
ఈ69న్యూస్ హన్మకొండ:-ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు.బుధవారం ఆమె కుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులను పరిశీలించారు.ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయని,ఫౌంటెన్,గ్రీనరీ,విద్యుత్ లైట్లు,సైన్ బోర్డులు,జిబ్రా క్రాసింగ్ తదితర మిగిలిన పనులను 10 రోజుల్లో పూర్తిచేయాలన్నారు.ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంతో పాటు మహిళా శక్తి క్యాంటీన్‌ను కూడా పరిశీలించిన ఆమె,పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.