
ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే నాగరాజుకు ఆహ్వానం
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన పరిసరాల్లో నూతన ఎల్లమ్మ దేవాలయం కార్యక్రమాలకు సిద్ధం
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ఆవరణలో నిర్మితమైన నూతన శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో త్వరలో జరగబోయే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హనుమకొండ జిల్లా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజుని ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా దేవాలయ కార్యనిర్వాహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు,ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్,అర్చకులు ఉప్పుల శ్రీనివాస్, నందనం భాను ప్రసాద్ శర్మలు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ కార్యక్రమం గ్రామస్థాయి భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహం నింపేలా,విభిన్న వైదిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.