
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు ఛలో అసెంబ్లీ
నూతన విద్యావిధానం 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేయాలి ఎస్ఎఫ్ఐ మరిపెడ మండల కమిటీ డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగం గురించి చర్చించి సమస్యలు పరిష్కారం చేయాలని, నూతన విద్యావిధానం 2020 ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీ లో తీర్మానం చేయాలని కోరుతూ రేపు ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ వీరబాబు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ళుగా 5,177 కోట్లు పెండింగ్ స్కాలర్ షిప్స్ పెండింగ్ రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయలేదని, గురుకులాలు, కెజిబివిలు మోడల్ స్కూల్స్ లో సమస్యలు అలాగే ఉన్నాయని వాటిని పరిష్కారం చేయలేదని మెస్ బిల్లులు విడుదల చేయలేదని, యూనివర్శీటీలలో ఫీజులు పెంచి ఉన్నత విద్యకు దూరం చేస్తుందని ,ప్రైవేట్ విద్యాసంస్థలలో భారీగా పెంచిన ఫీజులు,విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, తగ్గిన నిధులు కేటాయింపు గురుకులాలకు సోంత భవనాలు నిర్మాణం చేయాలని కోఠి ఉమెన్స్ యూనివర్శీటీకి నిధులు ఇవ్వాలని ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. రాష్ట్రంలో బిజెపి తెస్తున్న నూతన విద్యావిధానం కూడా అమలు చేయలేమని తీర్మానం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్ సాయి కుమార్ ప్రశాంత్ అనిల్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు