
కాడబోయిన లింగయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు
*రైతులను రాజులను చేయడం కాదు వారి పంటలకు ముందు నీళ్లు.ఇవ్వండి.. . స్థానిక ఎమ్మెల్యేలు కృషి చేయాలి ఎమ్మెల్యేలు కృషి చేయాలి.కాడబోయిన లింగయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు
న్యూస్ అయినవోలు……
రైతులు పండించిన పంటలకు నీళ్లు లేక మొక్కజొన్న వరి తో పాటు కూరగాయల తోటలు కూడా ఎండిపోతున్నాయని వెంటనే ప్రభుత్వం ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు విడుదల చేసి చెరువులలో నీరు నింపాలని ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.
ఈరోజు వెంకటాపురం ఒంటిమామిడిపల్లి వనమాల కనపర్తి కొండపర్తి*గుంటూరు పల్లి గ్రామాలలో ఎండిపోతున్న పంటలను సిపిఎం *ప్రతినిధి బృందం పరిశీలించింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ మండలంలోని వరి మొక్కజొన్న సాగు వ్యవసాయ అధికారులు అంచనా ప్రకారం 9300 ఎకరాలు మొక్కజొన్న 10000వేల ఎకరాల పైన రైతులు వేసినారు ఎస్సార్ ఎస్పి కెనాల్ నీరు వస్తాయని అలాగే బోరులలో నీల్లు ఉన్నాయని ఆశతో – పంటలు వేస్తే కెనాల్. నీరు రాక బోర్లలో నీరు అడుగంటలతో పంటలు ఎండిపోతు రైతులు దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేని దుస్థితి ఏర్పడుతుందని అన్నారు అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటుంది తప్ప రైతులకు చేసింది ఏమీ లేదని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలంలోని అన్ని గ్రామాల్లో చిన్న కెనాల్ కాల్వ ద్వారా చెరువులు నింపాలని అన్నారు రైతులను రాజులను చేయడం ఏమో oకానీ ముందు ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. పంటకు కనీస మద్దతు ధర ఇవ్వలేం లేదని అన్నారు మిర్చి పంట రైతులకు మిర్చి ధర క్వింటాకు 25 వేల రూపాయల చొప్పున ధర ఇవ్వాలని వెంటనే ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు లేకుంటే రైతు సంఘం ఆధ్వర్యంలో చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొంకాల నారాయణరెడ్డి మడిగే నాగరాజు వెంకటాపురం గ్రామ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు ఢీకొండా ఉప్పలయ్య లెక్కల పల్లి నరసయ్య… తదితరులు పాల్గొన్నారు….