
ఈ69న్యూస్ కేసముద్రః
ఏప్రిల్ ఫూల్ అంటూ బడుగు బలహీన సామాజిక పేద వర్గాలను కించపరుస్తున్నారని సామాజిక జాతీయ భావం గల ఉద్యమ నేత,తెలంగాణ సాధన నికార్సైన ఉద్యమ కారుడు తెలంగాణ శ్రీనివాస్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మహబూబాబాద్ లో వారి విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ నెలలోనే ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి,,జగ్జీవన్ రామ్ జయంతి, పూలే జయంతి ఎంతోమంది మేధావుల వర్ధంతిలు.అలాగే తక్కలపల్లి రవీందర్రావు సంధ్యా రాణిలా వివా వార్షికోత్సవాలు ఇలా ఎన్నో వెలకట్టలేని అద్భుతాలు, అమోఘాలు, మహా ఐశ్వర్యం లాంటి చరిత్రలో ఎన్నో ఉన్నాయని ఇది పూర్తిగా తెలుసుకోకుండా అవిజ్ఞానంతో అవివేకంతో వ్యవహరించడం సమంజసం కాదు అని అలాగే బీహార్ రాష్ట్రంలో 30 ఎకరాలపైగా వ్యవసాయ భూములు ఉండి కుల వర్ణ వివక్షతకు అవమానానికి గురైన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని వీరి కంటే నిరుపేదవాడైన ప్రపంచ మేధావిగా కొని యాడ పడుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్పవాడని కొనియాడుతూ నేడు..స్వ ప్రకటిత,అప్రకటిత,మేధావులుగా కొనసాగుతున్న కొన్ని వర్గాలకు, నిమ్నకుల ద్రోహులకు సూచించారు తక్షణమే వారి ఆలోచన విధానాలను మారాలని జ్ఞానోదయం కలగాలని భజనలు, బ్యూరోక్రసీ ఆపాలని కులాన్ని తాకట్టు పెట్టకూడదని తెలంగాణ శ్రీనివాస్ నాయక్ అన్నారు.