ఈ69న్యూస్ ఐనవోలు
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామ పదవ వార్డు ఐనా నాగపురం ఆమ్లేట్ గ్రామంలో బుధవారం రేషన్ షాపును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మెట మహేందర్ రాష్ట్ర నాయకులు రాయపురం సాంబయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు ఈ69న్యూస్ తో మాట్లాడారు.ఒంటి మామిడిపల్లి గ్రామానికి సుమారు 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న నాగపురం ఆమ్లెట్ గ్రామ ప్రజలు గత 30 సంవత్సరాల నుండి రేషన్ సరుకులు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడే వారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు రేషన్ షాపు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు రేషన్ షాపు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఎమ్మెల్యే నాగరాజుకు గ్రామస్తులు కృతజ్ఞత తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒంటిమామిడిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు గిరిక రాజు అధికార ప్రతినిధి కొత్తూరి సునీల్ మైనార్టీ మండల అధ్యక్షులు రహీం పాషా టెంపుల్ డైరెక్టర్ పెండ్లి సంపత్ మండల మైనారిటీ నాయకుడు రహీం ఖాన్ గోనె భాస్కర్ మాజీ ఉపసర్పంచ్ కొట్టం రాజు అనుముల రవి మడిగే రాజిరెడ్డి మామిళ్ల రంజిత్ ఉడత శ్రీకాంత్ కొట్టం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

