
inavolu mallanna temple

ఈ69 న్యూస్ హన్మకొండ
హన్మకొండ జిల్లా అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా నూతన వస్త్రాలంకరణ,మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము,బిల్వార్చన,మహనివేదన,నీరాజన,మంత్రపుష్ప,తీర్థ ప్రసాద వితరణ మరియు అయినవోలు మధుకర్ శర్మచే పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు,ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్,మధు శర్మ,భాను ప్రసాద్,నరేష్ శర్మ,విక్రాంత్ వినాయక్ జోషి గ్రామస్థులు,సిబ్బంది పాల్గొన్నారు.