
ఒంటిమామిడిపల్లి పాఠశాల రాష్ట్రానికి ఆదర్శం

ఈ69న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లా,ఐనవోలు మండలం,ఒంటిమామిడిపల్లి గ్రామంలోని పీఎం ఒంటిమామిడిపల్లి(ఇంగ్లీష్ మీడియం)పాఠశాల అభివృద్ధి పట్ల తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూరి మురళి సంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన పాఠశాల పర్యటన సందర్భంగా తరగతి గదులను పరిశీలించి,విద్యార్థులతో సంభాషించి వారి ప్రతిభను మెచ్చుకున్నారు.ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.పాఠశాలలోని ప్రీ-ప్రైమరీ ప్లే టూల్స్,సైన్స్ ల్యాబ్,కంప్యూటర్ ల్యాబ్,మినరల్ వాటర్ ప్లాంట్,సీసీ కెమెరా వంటి ఆధునిక సౌకర్యాలను ఆయన సమీక్షించారు.మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి,ఆ ఏర్పాట్లను మెచ్చుకున్నారు.పాఠశాల అభివృద్ధిలో పేరెంట్స్ కమిటీ మరియు తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు.ప్రైవేట్ ఉపాధ్యాయుల నియామకం ద్వారా స్టడీ హవర్స్ ఏర్పాట్లు చేసిన తల్లిదండ్రుల చర్యను ఆదర్శంగా పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ఒంటిమామిడిపల్లి పాఠశాలను రోల్ మోడల్‌గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి దిశగా నడిపించాల్సిన అవసరం ఉంది,అని ముఖ్యమంత్రికి నివేదిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజ,ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్,మండల విద్యాశాఖాధికారి పులి ఆనందం,బాలవికాస డైరెక్టర్ శౌరెడ్డి తిరుపతి,వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.