telugu galam news e69news loacl news telugu daily news
కష్టపడితే కానిది అంటూ ఏదీ లేదని నిరూపించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన పగిండ్ల నర్సయ్య ఒకేసారి రెండు ప్రభుత్వ కొలువులు సాధించి సత్తా చాటారు.నిరుపేద రజక కుటుంబంలో పుట్టి చిన్నప్పటినుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎంఏ బీఈడీ పూర్తి చేశారు. 12 సంవత్సరాల నుండి ఒక ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూనే, గతేడాది రాష్ట్ర గురుకుల విద్య సంస్థ అధ్యాపక పోస్టుల కోసం పరీక్ష రాశారు.ఇటీవల విడుదలైన ఫలితాల్లో జూనియర్ కళాశాల లెక్చరర్, టిజిటి సోషల్ రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం గురుకులం జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్ట్ ని ఎంచుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ ప్రజలందరూ అతనికి అభినందనలు తెలియజేశారు.