ఈ69 న్యూస్ హన్మకొండ

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల జాబితా ఫారం 6,7,8ల సవరణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్ నిర్వహించారు.సోమవారం హనుమకొండ లోని ఆర్డీవో కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహించారు.ఓటర్ల జాబితాలో నూతన, ఓటర్ల మార్పుచేర్పులు,ఒక నియోజకవర్గంలో నుంచి మరొక నియోజకవర్గ మార్పులు చేర్పులు,చిరునామా మార్పిడి దరఖాస్తు చేసుకునే విధంగా బిఎల్వోల వద్ద నమోదు చేసుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆర్డీవో కోరారు.బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను ఇవ్వాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యంతరాలు తెలియజేయడంతో పాటు సూచనలు చేశారు.ఈ సమావేశంలో ఎన్నికల విభాగం నాయబ్ తహసిల్దార్ సిరంగి విఠలేశ్వర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎండి నేహాల్, రావు అమరేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, శ్యామ్ సుందర్ ,సయ్యద్ ఫైజుల్లా,తదితరులు పాల్గొన్నారు.