
కట్టమైసమ్మ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు లోయర్ ట్యాంకుబండ్ శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ గౌతమ్ కుమార్ పటేల్, ఆలయ ఈవో కె సాంబశివరావులు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవాలయంలో జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబందించిన ఉత్సవాలకు సంబందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈనెల 22వ తేదిన ప్రారంభమై అక్టోబరు 2వ తేది వరకు అమ్మవారికి నిర్వహించే పూజా కార్యక్రమాలను వారు వివరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు సోమవారం అమ్మవారిని బాలత్రిపుర సుందరీ దేవి అలంకరణ, మంగళవారం శ్రీ మంగళగౌరీ దేవి ఆలంకరణ, బుధవారం గాయిత్రీ దేవి అలంకరణ, గురువారం కాత్యాయని దేవి అలంకరణ, శుక్రవారం మహాలక్ష్మి దేవి అలంకరణ. శనివారం శ్రీ లలితా దేవి అలంకరణ, ఆదివారం అన్నపూర్ణదేవి అలంకరణ, సోమవారం సరస్వతి దేవి అలంకరణ, మంగళవారం దుర్గాదేవి అలంకరణ బు దవారం రాజరాజేశ్వరి అలంకరణ, గురువారం మహిషాసుర మర్ధిని దేవి అలంకరణతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ప్రతి రోజు ఉదయం శ్రీ పంచామృతాభిషేకం, ఏడు గంటలకు బడ్గ మాలర్చాన బాలబోగము, 9 గంటలకు కలశ స్థాపన, 11 గంటలకు లలితా సహస్ర నామార్చన తదంతరం చండీహోమం. 12 గంటలకు మహానివేదన మంత్ర పున్నం, సాయంత్రం ఆరుగంటలకు ప్రత్యేక అలంకరణ ఉబయ దాతల పూజలు, 930 గంటలకు హారతి, మంత్రపుష్పం ఉంటాయని వారు తెలిపారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్లో నిశ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కనీస సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ కమిటీ సభ్యులు. పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహంచి అమ్మవారి కృపను పొందాలని వారు కోరారు. ఈ ఈసమావేశంలో ఆలయ సీనియర్ అసిస్టంట్ సతీష్ ప్రధాన ఆర్పకులు సాత్విక్ శర్మ. రాజేశ్ శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.