
కడియం శ్రీహరి కృషి వల్లనే 100 పడకల ఆసుపత్రి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ,ఉత్తర్వులు జారీచేసిన ముఖ్య మంత్రి కె.సి.అర్ కు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరియు కేటిఆర్ కు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రత్యేక కృతజ్ఞతలు తలిపారు.కడియం శ్రీహరి గతంలో నియోజకవర్గ ప్రజల వైద్య అవసరాల నిమిత్తం100పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని,మరియు ఘనపూర్ ను మున్సిపాలిటీ గా చేయాలని షోడాశపల్లి గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఐ.టి మరియు మున్సిపల్ శాఖ మాత్యులు కె.టి.రామారావుతో కోరడం జరిగిందని తెలిపారు. కేటిఅర్ చొరవతో ప్రజల అవసరాన్ని గుర్తించి ముఖ్య మంత్రి కేసీఆర్ 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.